Trisha | త్రిష సైలెంట్ రియాక్షన్ వైరల్ ..రాజకీయ వివాదాల మధ్య లవ్ కోట్స్‌తో సందేశం
Trisha | సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గత కొంతకాలంగా సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న వేళ, ఆమె పేరు అనుకోకుండా రాజకీయ చర్చల్లోనూ వినిపిస్తోంది. విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత, అతడిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శల్లో త్రిష పేరు కూడా లాగడం కూడా చర్చనీయాంశంగా మారింది.
Trisha | సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గత కొంతకాలంగా సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న వేళ, ఆమె పేరు అనుకోకుండా రాజకీయ చర్చల్లోనూ వినిపిస్తోంది. విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత, అతడిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శల్లో త్రిష పేరు కూడా లాగడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిణామాల మధ్య కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న త్రిష, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని భావోద్వేగపూరిత వీడియోలు, కోట్స్ షేర్ చేశారు. ఒక వీడియోలో ఇతరుల అభిప్రాయాలను మనం నియంత్రించలేం… మనం చేయగలిగింది మన జీవితాన్ని నిజాయితీగా, మంచిగా గడపడం మాత్రమే అనే సందేశాన్ని పంచుకున్నారు.
ఇంకో వీడియోలో “సరిగ్గా ఉండటం కంటే శాంతి ముఖ్యమైనది… ప్రతీ వాదనకు స్పందించడం అవసరం లేదు… మౌనం చాలా సందర్భాల్లో ఉత్తమ సమాధానం” అనే భావనను వ్యక్తపరిచారు. ఈ పోస్టులు చూస్తుంటే, ప్రస్తుత పరిస్థితులపై ఆమె పరోక్షంగా స్పందిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే “ప్రేమే సర్వస్వం కాదు… కానీ ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు” అనే కోట్‌ను షేర్ చేస్తూ ‘నిజం’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆమె పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లలో చర్చకు దారితీశాయి. తమిళనాడులో రాజకీయ వాతావరణం కాస్త వేడెక్కుతున్న వేళ, విజయ్ పై విమర్శల నేపథ్యంలో త్రిష పేరును కూడా కొన్ని వర్గాలు లాగడం హాట్ టాపిక్‌గా మారింది.ఇటీవల విజయ్ వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణల్లో కూడా ఓ సినీ నటితో సంబంధం ఉందని వార్తలు రావడం, అదే సమయంలో విజయ్–త్రిష కలిసి ఓ రిసెప్షన్‌కు హాజరుకావడం మరింత చర్చకు దారితీసింది.
ఇక పార్థీబన్ వంటి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వ్యవహారంపై స్పందించడం గమనార్హం. ఈ నేపథ్యంలో త్రిష పెట్టిన సోషల్ మీడియా పోస్టులు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండు దశాబ్దాలకు పైగా హీరోయిన్గా రాణిస్తున్న త్రిష, 40 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. గతంలో ఆమె ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ, అది రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. వివాదాలు పక్కన పెడితే, త్రిష సినిమాల పరంగా మాత్రం బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సూర్య సరసన ‘కరుప్పు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 14న విడుదల కానుంది. అలాగే చిరంజీవి తో కలిసి ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండి, త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
లోని భావాలను ప్రతిబింబిస్తున్నాయా? లేక పరిస్థితులకు సమాధానమా? అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు ఎన్నికలు ముగిసేలోపు ఈ వివాదం ఇంకెంత మలుపులు తిరుగుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

