Bhaktha Markendeya swamy | ధన్వాడ, ఆగస్టు 9 : అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, అనుబంధానికి ప్రతిరూపమైన రక్షాబంధన్ వేడుకలు నారాయణ పేట జిల్లా ధన్వాడ మండలంలోని వివిధ గ్రామాలలో శనివారం ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పద్మశాలి సంఘం వారు భక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకలను ధన్వాడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మార్కండేయ స్వామి దేవాలయంలో పాత యజ్ఞోపవీతాల స్థానంలో కొత్త యజ్ఞోపవీతాలు ధరించారు.
మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పలువురు సోదరులకు తమ అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి కట్న కానుకలు పొందారు. ఈ కార్యక్రమంలో పూజారి లోకేష్ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉదయభాను నాయకులు కించ భాస్కర్ బాలయ్య వెంకటేష్ రాజు, జయప్రకాష్ మాకం సురేందర్ రంగయ్య మార్గం వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
Shivraj Singh Chouhan: చెట్టుకు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి శివరాజ్.. వీడియో