Jupally krishna rao |పెద్దకొత్తపల్లి : పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ప్రతిష్ట కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మంత్రికి కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం సీతారాముల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు తోషఖాణ ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి తలారి కొండలయ్య, కోశాధికారి ఆలేటి విష్ణుమూర్తి, ప్రతిష్ట కార్యక్రమ అధ్యక్షుడు తోషఖాణ రామ్మోహన్, సభ్యులు కాసారం సత్యనారాయణ, వరిద్యాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్