న్యూఢిల్లీ, మార్చి 16 : టోకు ధరల సూచీ కూడా భగ్గుమన్నది. వరుసగా నాలుగు నెలలుగా పెరుగుతూ వచ్చిన టోకు ధరల సూచీ ఫిబ్రవరి నెలకుగాను 2.13 శాతానికి ఎగబాకింది. ఆహార, ఆహారేతర ఉత్పత్తుల ధరలు భారీగా పుంజుకోవడం వల్లనే టోకు ధరల సూచీ ఏకంగా 11 నెలల గరిష్ఠ స్థాయిని తాకింది.
అంతక్రితం నెలలో ధరల సూచీ 1.81 శాతంగా నమోదైంది. తయారీ, ఆహార-ఆహారేతర ఉత్పత్తులు, టెక్స్టైల్స్ రంగ ఉత్పత్తుల అధికమవడం వల్లనే టోకు ధరల సూచీ పుంజుకోవడానికి దోహదం చేసిందని పేర్కొంది. గత నెలలో ఆధార సూచీ 1.55 శాతం నుంచి 2.19 శాతానికి ఎగబాకగా, కూరగాయల సూచీ మాత్రం 6.78 శాతం నుంచి 4.73 శాతానికి దిగొచ్చింది.