Indiramma Houses | బిజినేపల్లి, జులై 2 : ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హత గల ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందుతాయన్నారు.
ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని.. అందులో భాగంగానే రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. ప్రజల నివాస అవసరాలను తీర్చే దిశగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో వెంకట్ స్వామి, తిరుపతయ్య, నసీర్, రాములు, రామకృష్ణ, పరుష రాములు, ముక్తార్, ఈశ్వర్, శంకర్, పాషా, రాము, సుల్తాన్, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య