నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 3 : మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు అడ్డదారుల్లో వెళ్తూ మరోసారి తమ సంకుచిత బుద్దిని బయటపెట్టుకుంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల అరాచకాలు అంతులేకుండా పోతున్నాయి.
కాంగ్రెస్ నేతలు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అభ్యర్థి నసీమా బేగం నామినేషన్ను విత్ డ్రా చేయించే ప్రయత్నం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, కాంగ్రెస్ నేతలు నసీమా బేగం ఇంటికి వెళ్లి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ప్రలోభాలకు పాల్పడ్డారు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అభ్యర్థి ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి నసిమా బేగం ఇంట్లో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఎలాంటి ఘర్షణ జరుగకుండా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అభ్యర్థి నసిమా బేగం చివరకు మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వంలోనే తాను పనిచేస్తానని తెగేసి చెప్పడంతో కాంగ్రెస్ నేతలు తెల్ల మొఖం వేసుకొని వెళ్లిపోయారు.
Jagthyal | జగిత్యాల మున్సిపల్ పోరులో జీవన్ రెడ్డి vs సంజయ్