హైదరాబాద్, జూన్ 5 (నమస్తేతెలంగాణ) జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ (Pedda Dhanwada) గ్రామ శివారులో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పర్రిశమ(Ethanol Factory)ను వెంటనే ఉపసంహరించుకోవాలనితెలంగాణ రైతు సంఘం ర్రాష్ట అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు, ర్రాష్ట ప్రధాన కార్యదర్శి టి. సాగర్ డిమాండ్ చేశారు. అరెస్టు చేసి రిమాండ్కు పంపింన రైతులను వెంటనే విడుదల చేయాలని.. వారిపై పెట్టిన కేసులు బేషరతుగా ఎత్తివేయాలని తమ ప్రకటనలో అన్నారు. అంతేకాదు మరికొందరిని అరెస్టు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నట్లు సుదర్శన్ రావు, సాగర్ పేర్కొన్నారు.
ఇథనాల్ పర్రిశమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 12 గ్రామాల ప్రజలు గత పది నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్నారని సుదర్శన్ రావు, సాగర్ తమ ప్రకటనలో తెలిపారు. జనవరి, ఫ్రిబవరిలో దాదాపు 20 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేయడంతో పర్రిశమను ఏర్పాటు చేయనివ్వము అని ప్రభుత్వం ద్వారా రైతులకు హామీ ఇవ్వడంతో దీక్షలు విరమించారని వారు గుర్తుచేశారు.
కానీ కంపెనీ యాజమాన్యం జూన్ 2వ తేదీ అర్ధర్రాతి జేసీబీలు, కంటైనర్లు, ట్రిప్పర్లతో పాటు కూలీలను తీసుకొని రావడమే కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఆందోళన చెందారని అన్నారు రైతు సంఘం ప్రతినిధులు. తమను మోసం చేశారని ప్రజలు పెద్ద ఎత్తున బుధవారం పర్రిశమ ఏర్పాటు చేసే ప్రాంతానికి నిరసన తెలిపేందుకు వెళ్లారు. అయితే.. అక్కడ ఉన్న బౌన్సర్లు, కూలీలు వాళ్లను అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొందని సుదర్శన్రావు , టి సాగర్ తెలిపారు.
రైతులను అరెస్టు చేసి మానవపాడు పోలీస్స్టేషన్లో ఉంచి 40 మందిపై కేసులు నమోదు చేశారని సుదర్శన్రావు,సాగర్లు పేర్కొన్నారు. పెద్దధన్వాడ,చిన్న ధన్వాడ గ్రామాలకు సంబంధించిన 12 మందిని రిమాండ్కు పంపించారని తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణం చేయొద్దని.. ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీ చార్జి, అక్రమ అరెస్టులు సరైనది కాదన్నారు. గురువారం కూడా గ్రామసభలో పోలీసులు మరికొందరు రైతులను అరెస్టు చేయటానికి ప్రయత్నించారని.. వెంటనే అరెస్టులను ఆపాలని వారు డిమాండ్ చేశారు. స్థానికంగా గ్రామసభల అనుమతులు లేకుండా పర్రిశమ యాజమాన్యం పర్రిశమ నిర్మాణానికి పూనుకోవడం సరైనది కాదన్నారు. కనీసం గ్రామపంచాయతీ అనుమతి కూడా తీసుకోలేదన్నారు.
పర్రిశమ కోసం 27 ఎకరాలు భూమి సేకరించామని చెబుతున్న యాజమాన్యం కేవలం 6 ఎకరాల 29 గుంటలకు మాత్రమే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నాలా పర్మిషన్ తీసుకున్నారని గుర్తుచేశారు రైతు సంఘం ప్రతినిధులు. పర్రిశమ నిర్మాణం కోసం సేకరించిన భూమికి ఆనుకుని గత ప్రభుత్వ హయాంలో దళితులకు మూడెకరాల చొప్పున ఇచ్చిన భూమి 156 ఎకరాలు ఉందని, ఆ భూమి మొత్తం కాలుష్యానికి గురవుతుందని చెప్పారు. అలాగే 2009 సంవత్సరం వరదల సందర్భంగా చిన్నధన్వాడ గ్రామం ముంపునకు గురైన సందర్భంగా ఆ గ్రామ ప్రజలకు ఇంటి స్థలాల కోసం సేకరించిన భూమి కూడా పర్రిశమకు సేకరించిన భూమికి ఆనుకుని ఉన్నదని ఇరువురు తెలిపారు.
ప్రజాభ్రిపాయ సేకరణ చేయకుండా పర్రిశమ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం సరైనది కాదన్నారు సుదర్శన్రావు, టి సాగర్ . పర్రిశమతో తమ పచ్చటి పంట పొలాలు నాశనం అవుతాయని, తుంగభ్రద నది నీళ్లు కాలుష్యం అవుతాయని రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, నసనూరు, మాన్దొడ్డి, చిన్న తాండ్రపాడు, నౌరోజీ క్యాంపుతో పాటు 12 గ్రామాల ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారని సుదర్శనరావు,టి.సాగర్లు పేర్కొన్నారు.