Peddapally | పెద్దపల్లి కమాన్, జూన్ 5 : విద్యార్థుల విద్య సామర్థ్యాల పెంపునకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓ లు కృషిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓల వర్క్ షాప్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం నుండే విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పెంచడంలో ప్రతి ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు హెడ్మాస్టర్, ఎంఈఓ లు అందరూ కూడా వృత్యంత్ర శిక్షణ పొంది ఉన్నారని , కావున బోధన నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ప్రతీ విద్యార్థి బోధన సామర్ధ్యాలను పెంచాలన్నారు. విద్యార్థులు ధారాళంగా చదవడంలో అర్థం చేసుకొని రాయడం, గణిత సామర్థ్యాలను చక్కగా చేయడంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, ఎంఈఓ లు ప్రతినెల జరిగే కాంప్లెక్స్ సమావేశాలలో ప్రణాళికలు రూపొందించలన్నారు. ఇక్కడ డీఈఓ మాధవి, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.