నకిరేకల్, జూన్ 05 : నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో 47వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీలు కొనసాగుతున్నాయి. రెండో రోజు వివిధ జిల్లాల మధ్య హోరాహోరీగా పోటీలు జరిగాయి. రెండో రోజు బాలికల విభాగం నుండి 12 మ్యాచులు, బాలుర విభాగం నుండి 12 మ్యాచ్ లు నిర్వహించినట్లు తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ తెలిపారు.
బాలుర విభాగం నుండి వరంగల్ జట్టు, ఖమ్మం జట్టుపై 23-19 స్కోర్ తేడాతో, నల్లగొండ జట్టు, మహబూబ్నగర్ జట్టుపై 15-8 స్కోర్ తేడాతో అలాగే కరీంనగర్ జట్టు, రంగారెడ్డి జట్టుపై 19-10 స్కోర్ తేడాతో, మెదక్ జట్టు, అదిలాబాద్ జిల్లా జట్టుపై 20-15 స్కోర్ తేడాతో గెలుపొందాయి. వరంగల్, నల్లగొండ, కరీంనగర్, మెదక్ జిల్లా జట్లు సెమీ ఫైనల్స్ కు చేరుకున్నాయి.
బాలికల విభాగం నుండి ఖమ్మం జిల్లా జట్టు, అదిలాబాద్ జట్టుపై 20-8 స్కోర్ తేడాతో, రంగారెడ్డి జిల్లా జట్టు, నిజామాబాద్ జట్టుపై 9- 0 స్కోర్ తేడాతో, మహబూబ్నగర్ జిల్లా జట్టు, కరీంనగర్ జట్టుపై 19-9 స్కోర్ తేడాతో, వరంగల్ జిల్లా జట్టు, హైదరాబాద్ జిల్లా జట్టుపై 9-6 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి, వరంగల్ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ ఉస్మాన్, చింతకాయల పుల్లయ్య తెలిపారు.
Nakrekal : మంగళపల్లిలో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు