MLA Vijayudu | జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ దుర్మార్గమైన పాలన అని విజయుడు ఘాటుగా విమర్శించారు.
అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు హాజరుకానుండగా.. ముందస్తుగానే కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా ఉండేలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అక్రమంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే విజయుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకొని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. మా బీఆర్ఎస్ కార్యకర్తలను ఇలా అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌పై ప్రేమ ఉంటే వారినే కార్యక్రమాలకు తీసుకెళ్లాలని.. మా కార్యకర్తలు లేనిదే అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనే ప్రసక్తి లేదన్నారు. ఇప్పటికైనా పోలీసులు కాంగ్రెస్‌కు కాకుండా ప్రజలకు సానుకూలంగా ఉండాలని హితవు పలికారు.
Salaar 2 | ప్రభాస్ సలార్ 2 టీజర్ వచ్చేస్తుంది.. ఇంతకీ ఏ తేదీనో తెలుసా..?
Actor Srikanth | ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధిలో నటుడు శ్రీకాంత్.. వీడియో వైరల్