జోగులాంబ గద్వాల : లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామ సమీపంలో భారీ లోడుతో వెళ్లే లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గుల్బర్గాకు చెందిన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Hyderabad | గర్భవతైన భార్యను హత్యచేసి.. తల, కాళ్లు, చేతులను వేరు చేసి మూసీలో పడేశాడు..
Renu Desai | న్యూడిటీ, పోర్న్ వీడియోలు ఓకే .. మంచి పని చేస్తే బ్యాన్ చేస్తారా.. రేణూ దేశాయ్ ఆవేదన
శిథిలావస్థలో సర్కారు కాలేజీ భవనాలు.. 35 కాలేజీల్లో దినదిన గండంగా గడుపుతున్న విద్యార్థులు