Hyderabad | హైదరాబాద్ (Hyderabad) లని బోడుప్పల్ మేడిపల్లిలో ఉన్న బాలాజీహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. గర్భవతైన భార్యను చంపిన భర్త, ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు స్వాతి, మహేందర్ రెడ్డి ప్రేమవివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం స్వాతిని (22) హత్యచేసిన మహేందర్.. తల, కాళ్లు, చేతులు వేరు చేసి వాటిని మూసీ నదిలో పడేశాడు. మిగిలిన మొండాన్ని కవర్లో ప్యాక్ చేసి పెట్టాడు. అయితే దానిని తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో గదిలోనే ఉంచాడు.
స్వాతి ఆత్మహత్య చేసుకున్నదని తన సోదరికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె స్వాతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అనుమానం వచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకుగల కారణాలపై ఆరా తీస్తున్నారు.