Renu Desai | సినీ నటి, సామాజిక కార్యకర్తగా పాపులారిటీ దక్కించుకున్న రేణూ దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. వీధి కుక్కల సంరక్షణపై ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలకి సంబంధించిన వీడియోలను ఇన్స్టాగ్రామ్ తొలగించడంపై తీవ్రంగా స్పందించింది. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, వీధి కుక్కలను రోడ్లపై తిరగనివ్వకుండా షెల్టర్లకు తరలించాలన్న ఆదేశాలపై రేణూ అభ్యంతరం తెలిపారు. తన NGO ద్వారా వీధి కుక్కలకు ఆహారం, ఆశ్రయం, వైద్య సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రేణూ, వాటిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే వాటిపై కొంతమంది రిపోర్ట్ చేయడంతో, ఇన్స్టాగ్రామ్ వాటిని నిషేధించిందని ఆమె తెలిపారు.
“ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడిటీ, పోర్న్ వీడియోలు ఓకే.. కానీ మంచి పనిని షేర్ చేయడం మాత్రం నిషేధించబడింది. తమ స్వచ్ఛంద సంస్థ చేసిన నిజమైన మంచి పనులను చూపిస్తే, జనాలు దానిని రిపోర్ట్ చేసి మా NGO ఖాతాను బ్యాన్ చేయాలని చూస్తున్నారని రేణూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాక తాను పోస్ట్ చేసిన వీడియోలను తొలగించారని పేర్కొంటూ, స్క్రీన్షాట్లు కూడా షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రేణూ చేసిన పని మంచిదేనంటూ, ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించాల్సిందని పలువురు వ్యాఖ్యానించారు.
అయితే, రేణూ తను పెట్టిన పోస్ట్‌ని కొద్ది సేపటి తర్వాత ఎడిట్ చేశారు. ‘పోర్న్ వీడియోలు ఓకే కానీ మంచి పనిని షేర్ చేయడం బ్యాన్ చేయబడింది’ అన్న వ్యాఖ్యను తొలగించి, మిగిలిన సమాచారాన్ని అలానే ఉంచారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన రేణూ దేశాయ్, తన నటనా ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాత, దర్శకురాలిగా విభిన్న మార్గాల్లో కెరీర్‌ను కొనసాగించారు. పవన్ కళ్యాణ్‌తో సహజీవనంలో ఉన్న సమయంలో సినీ జీవితానికి విరామమిచ్చిన ఆమె, విడాకుల అనంతరం సేవా కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించారు. ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో తిరిగి వెండితెరపై కనిపించారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిస్పందనలకు సంబంధించిన వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.