Farmer | అలంపూర్, డిసెంబర్ 24: అన్నదాత గుండెపోటుతో కొనుగోలు కేంద్రం వద్దే కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ హృదయ విదారకమైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద చోటుచేసుకుంది. కొనుగోలు కేంద్రం వద్ద బుధవారం రైతు జమ్మన్న గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.. ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన జమ్మన్న (64) రైతు మొక్కజొన్న పంటను అమ్ముకునేందుకు కలుకుంట్ల గ్రామంలో రైతు వేదిక దగ్గర ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే పది రోజులైనా తేమ శాతం కారణంగా మొక్కజొన్న కొనుగోలు కాంట పోవడంతో రోజు చలిగాలికి ధాన్యం కుప్ప దగ్గరే పడిగాపులు కాయవలిసి వచ్చింది. చివరికి అధికారుల చొరవతో మంగళవారం రోజు దాన్యం కాంటా వేసుకున్నారు.
కాగా జమ్మన్న బుధవారం రోజు ఆన్లైన్లో పేరు ఎంట్రీ చేయించేందుకు మరోసారి మొక్కజొన్న కేంద్రానికి వెళ్లగా.. బొటనవేలు ముద్ర వేస్తున్న సమయంలో జమ్మన్న గుండెపోటుకు గురై మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. జమ్మన్నకు భార్య దేవమ్మతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Dhurandhar | ‘ధురంధర్’ కలెక్షన్లపై పాక్ ప్రజల వింత డిమాండ్.. కలెక్షన్స్‌లో మాకు వాటా ఇవ్వాలి..
Nani | నాని ‘ది ప్యారడైజ్’లో డ్రాగన్ బ్యూటీ.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
Karate Kalyani | హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు.. కరాటే కల్యాణి ఊహించని స్పందన