Nani | నాని ‘ది ప్యారడైజ్’లో డ్రాగన్ బ్యూటీ.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
Nani | ‘డ్రాగన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి కాయదు లోహర్ ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా మారింది. తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె, తాజాగా తన కెరీర్లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌కు అధికారికంగా ఓకే చెప్పింది.
Nani | ‘డ్రాగన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి కాయదు లోహర్ ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా మారింది. తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె, తాజాగా తన కెరీర్లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌కు అధికారికంగా ఓకే చెప్పింది. నాని హీరోగా నటిస్తున్న కొత్త తెలుగు సినిమా ‘ది ప్యారడైజ్’లో కాయదు లోహర్ కీలక పాత్రలో కనిపించనుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్లో ఆమె పాల్గొంటుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వాటిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోగా, ఇప్పుడు స్వయంగా కాయదు ఆ వార్తలను కన్ఫార్మ్ చేయడంతో సందేహాలకు తెరపడింది.
‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ విడుదలైనప్పుడు థియేటర్లలో వచ్చిన రియాక్షన్‌ను చూపిస్తూ కాయదు లోహర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అదే వీడియో ద్వారా ఈ సినిమాలో తాను భాగమని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఆమె షూటింగ్ కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఈ సినిమా నానికి చాలా కీలకమైన ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుండగా, భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ ప్రాజెక్ట్‌తో పాటు కాయదు లోహర్ మరో బిగ్ మూవీకి కూడా సైన్ చేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘ఐం గేమ్’ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. దీనితో పాటు ఆమె చేతిలో ఇంకా కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కుతుండటంతో కాయదు కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. వచ్చే ఏడాది విడుదల కానున్న సినిమాలతో 2026 ఆమెకు కెరీర్లోనే స్పెషల్ ఇయర్‌గా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగు సహా ఇతర భాషల్లోనూ కాయదు లోహర్‌కు మరింత గుర్తింపు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Acidity | ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తరచూ వస్తున్నాయా..? అయితే అందుకు కారణాలు ఇవే..!
Man Throws Sons Into Canal | ఇద్దరు కుమారులను కాలువలోకి విసిరేసిన తండ్రి.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై రాళ్ల దాడి
Litton Das | టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ సరికొత్త రికార్డు..!
Professor Teja Sri | నా కూతురికి న్యాయం చేయండి.. అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ తల్లి నిరాహార దీక్ష
TTD | 8.34 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత : టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

