అమరచింత, మే 12 : మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డులో బీఆర్ఎస్ నాయకుడు తాటికొండ రమేష్ తండ్రి తాటికొండ వెంకటస్వామి సోమవారం రాత్రి అనారోగ్యం పాలై మృతి చెందాడు. స్థానిక బీఆర్ఎస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మంగళవారం తాటికొండ వెంకటస్వామి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధైర్యపడొద్దు అండగా ఉంటామని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Virat Kohli: టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు
Airports Reopen | సరిహద్దుల్లో సాధారణ పరిస్థితి.. దేశంలో తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు