Airports Reopen | సరిహద్దుల్లో సాధారణ పరిస్థితి.. దేశంలో తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు
Airports Reopen | భారత్-పాక్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను అధికారులు మూసివేసిన (airports shut) విషయం తెలిసిందే. తాత్కాలికంగా మూసివేసిన ఎయిర్‌పోర్ట్స్‌ను అధికారులు తిరిగి తెరిచారు (Airports Reopen).
Airports Reopen | భారత్-పాక్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను అధికారులు మూసివేసిన (airports shut) విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన ఎయిర్‌పోర్ట్స్‌ను అధికారులు తిరిగి తెరిచారు (Airports Reopen). 32 విమానాశ్రయాలను సోమవారం తిరిగి తెరిచినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించింది.
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులతో సరిహద్దుల్లోని ప్రాంతాలు దద్దరిల్లాయి. పాక్ డ్రోన్లు, క్షిపణులతో భారత్‌పై దాడులు చేస్తుండటంతో పౌర విమానాల రాకపోకలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిషేధం విధించింది. దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని మొత్తం 32 విమానాశ్రయాలను (Airports) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
అధంపూర్, అంబాలా, అమృత్సర్, అవంతీపురా, భటిండా, బికనేర్, భూజ్, చంఢీగఢ్, హల్వారా, హిండన్, జమ్ము, జామ్‌నగర్, జోథ్‌పూర్, జైసల్మేర్, కండాలా, కాంగ్రా, కేషోడ్, కిషన్‌గఢ్, కులు మనాలి, లేహ్, లూథియానా, ముంద్రా, నలియా, పఠాన్‌కోట్, పటియాలా, పోర్బందర్, రాజ్‌కోట్, సర్సావా, శ్రీనగర్, షిమ్లా, తోయ్‌స్, ఉత్తర్లాయ్ ఎయిర్‌పోర్టులను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 15 వరకు ఆయా ఎయిర్‌పోర్టుల నుంచి ఎలాంటి విమానాల రాకపోకలు ఉండవని స్పష్టం చేసింది. అయితే, తాజాగా కాల్పుల విరమణ ఒప్పందంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరడంతో అధికారులు ఆయా విమానాశ్రయాలను తిరిగితెరిచారు.
Also Read..
DGMOs | మరికాసేపట్లో భారత్-పాక్ మధ్య చర్చలు.. ఇందులో పాల్గొనే ఇరుదేశాల డీజీఎంవోలు వీళ్లే..
PM Modi | మరికాసేపట్లో భారత్-పాక్ డీజీఎంవోల చర్చలు.. ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నతస్థాయి సమావేశం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

