DGMOs | భారత్-పాక్ డీజీఎంవోలు (DGMOs) నేడు చర్చలు జరపనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో చర్చించనున్నారు. భారత్ తరఫున డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఈ చర్చల్లో పాల్గొననున్నారు. ఇక పాక్ తరఫున డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొంటారు. కాల్పుల విరమణ అనంతర పరిణామాలు, పీవోకే అంశం వీరి మధ్య చర్చకు రానుంది. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపుపై చర్చించే అవకాశం ఉంది.
పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరింది. ఈనెల 10న ఇరు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. ఈ నెల 12న ఇరుదేశాల డీజీఎంవోలు మరోసారి చర్చలు జరపున్నట్లు అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఇరు దేశాల డీజీఎంవోలు హాట్లైన్లో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు.
ఈ సమావేశానికి ముందు త్రివిధ దళాధిపతులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. పాక్తో చర్చించాల్సిన అంశాలపై వారికి దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
Also Read..
DGMO | మధ్యాహ్నం 2.30 గంటలకు త్రివిధ దళాల ప్రెస్మీట్
Vikram Misri | సీజ్ఫైర్ ప్రకటనతో ట్రోల్స్.. సోషల్ మీడియా ఖాతాలను లాక్ చేసుకున్న విక్రమ్ మిస్రీ
Indian Army | పాక్తో కాల్పుల విరమణ ఒప్పందం.. సరిహద్దుల్లో పరిస్థితిపై భారత సైన్యం కీలక ప్రకటన..!