DGMO | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరిన నేపథ్యంలో త్రివిధ దళాధిపతులు ఇవాళ మరోసారి ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ఫోర్స్.. ఈ మూడు సర్వీసులకు చెందిన డీజీఎంఓలు (Director General Military Operations) సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.
మరోవైపు త్రివిధ దళాధిపతులు ఆదివారం కూడా మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ గురించి వివరించారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలిపారు. ఇదే సమయంలో.. ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత సైన్యానికి చెందిన ఐదుగురు జవాన్లు వీరమరణం పొందినట్టు చెప్పారు. పలువురు పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారన్నారు. వారందరికీ భారత సైన్యం తరఫున నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు. దాడులకు ముందు, దాడులకు తర్వాత పరిస్థితులను వివరించే ఫొటోలు, వీడియోలను ప్రదర్శించారు.
Also Read..
Operation Sindoor | పాక్ దుశ్చర్యలకు దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం : డీజీఎంవో