PM Modi | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నిన్నటి నుంచి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా సోమవారం ఉదయం కూడా మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. మరో గంటలో భారత్-పాక్ డీజీఎంవోల చర్చలు జరగనున్న (DGMO level truce talks) విషయం తెలిసిందే. ఈ చర్చలకు ముందు మోదీ అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్తో చర్చించాల్సిన అంశాలపై వారికి దిశా నిర్దేశం చేశారు.
భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కొంత తేలికపడింది. కాల్పుల విరమణకు (ceasefire) పాకిస్థాన్ ప్రతిపాదించగా అందుకు భారత్ అంగీకరించింది. పూర్తిస్థాయిలో, తక్షణ కాల్పుల విరమణకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. తదుపరి కార్యాచరణ కోసం రెండు దేశాల డీజీఎంవోలు ఈ నెల 12న మరోసారి సమావేశం కానున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో మోదీ భేటీ నిర్వహించారు.
Also Read..
DGMO | మధ్యాహ్నం 2.30 గంటలకు త్రివిధ దళాల ప్రెస్మీట్
Vikram Misri | సీజ్ఫైర్ ప్రకటనతో ట్రోల్స్.. సోషల్ మీడియా ఖాతాలను లాక్ చేసుకున్న విక్రమ్ మిస్రీ
Indian Army | పాక్తో కాల్పుల విరమణ ఒప్పందం.. సరిహద్దుల్లో పరిస్థితిపై భారత సైన్యం కీలక ప్రకటన..!