హైదరాబాద్: డ్యాషింగ్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు(Virat Kohli) క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అతను ఇన్‌స్టా అకౌంట్లో ఓ భావోద్వేగపూరిత పోస్టును పెట్టాడు. టెస్టు క్రికెట్లో దేశం తరపున అరంగేట్రం చేసి 14 ఏళ్లు అవుతున్నట్లు కోహ్లీ తన పోస్టులో తెలిపాడు. టెస్టు ఫార్మాట్ తనకు ఎంతో నేర్పిందని, తనను పరీక్షించిందని, తతను తీర్చిదిద్దిందని, జీవితానికి కావాల్సిన ఎన్నో పాఠాలు నేర్పినట్లు కోహ్లీ పేర్కొన్నాడు. తెలుపు రంగు దుస్తుల్లో ఆడడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందన్నారు. టెస్టు ఫార్మాట్‌ను వీడడం సులువైన అంశం కాదు అని, కానీ సరైన సమయం అని, ఆ ఫార్మాట్ ఎంతో చేశానని, తనకు కూడా ఎంతో కలిసి వచ్చిందన్నారు. ఊహించినదాని కన్నా ఎక్కువే లాభం జరిగిందన్నాడు.
✍️ “It’s not easy — but it feels right”
Virat Kohli announces his Test retirement pic.twitter.com/p56bj7FBit
— ESPNcricinfo (@ESPNcricinfo) May 12, 2025
కోహ్లీ 123 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 68 మ్యాచ్‌లకు అతను కెప్టెన్‌గా చేశాడు. బ్యాటింగ్ సగటు 46.85తో అతను 9230 రన్స్ చేశాడు. జూన్‌లో ఇంగ్లండ్‌తో అయిదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి కోహ్లీ టెస్టు రిటైర్మెంట్పై చర్చ జరుగుతోంది. రోహిత్ తరహాలోనే టెస్టు నుంచి తప్పుకునేందుకు కోహ్లీ సిద్దంగా ఉన్నట్లు వార్తలు వ్యాపించాయి. అయితే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని కోహ్లీ.. బీసీసీఐకి చెప్పినట్లు కూడా తెలుస్తోంది.
వాస్తవానికి టెస్టు ఫార్మాట్లో కోహ్లీ పెద్దగా ఫామ్‌లో లేడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ పెర్త్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ కొట్టాడు. సుమారు ఏడాది గ్యాప్ తర్వాత అతను ఆ ఇన్నింగ్స్ ఆడాడు. ఓ దశలో టెస్టుల్లో కోహ్లీ యావరేజ్ టాప్‌గా ఉండేది. టాప్ ఫామ్‌లో ఉన్న సమయంలో కోహ్లీ టెస్టు యావరేజ్ 55.10గా ఉంది. కానీ గత 24 నెలల్లో అతను టెస్టు యావరేజ్ 32.56కు పడిపోయింది.
అనుభవం దృష్ట్యా.. ఇంగ్లండ్ టూరుకు అవసరం ఉన్నా.. కోహ్లీ తనంతటే తానే తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. టెస్టుల్లో కోహ్లీ 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేశాడు.