Kiran Abbavaram | హిట్ జోరు .. కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ ఏకంగా అంత పెంచాడా?
Kiran Abbavaram | టాలీవుడ్లో సక్సెస్ ఒక్కటి పడితే హీరోల మార్కెట్ విలువ ఎలా పెరుగుతుందో మరోసారి చర్చకు దారితీసింది. యువ హీరో కిరణ్ అబ్బవరం. వరుసగా మంచి విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్‌ను ఆస్వాదిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Kiran Abbavaram | టాలీవుడ్లో సక్సెస్ ఒక్కటి పడితే హీరోల మార్కెట్ విలువ ఎలా పెరుగుతుందో మరోసారి చర్చకు దారితీసింది. యువ హీరో కిరణ్ అబ్బవరం. వరుసగా మంచి విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్‌ను ఆస్వాదిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల వచ్చిన ‘క’, ‘కె ర్యాంప్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించడంతో కిరణ్ అబ్బవరం మార్కెట్ గణనీయంగా పెరిగిందని సమాచారం. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే కథలు, అందులో కామెడీ–ఎమోషన్–సెంటిమెంట్ మేళవింపుతో ఆయన ఎంచుకునే స్క్రిప్ట్స్ నిర్మాతలకు నమ్మకం కలిగిస్తున్నాయంటున్నారు.
“కిరణ్‌తో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ” అన్న భావన కొందరు నిర్మాతల్లో ఏర్పడిందని ఇండస్ట్రీ టాక్. దీంతో ఆయనకు భారీ ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం. తాజా సమాచారం ప్రకారం, కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ.12 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. ఇటీవల ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో కుదిరిన ఒప్పందంలో కూడా ఇదే స్థాయిలో పారితోషికం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ‘కె ర్యాంప్’ తర్వాత కిరణ్ అబ్బవరం మరో రిఫ్రెషింగ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఆయన ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్నారు. కథను ‘బేబీ’ ఫేమ్ సాయి రాజేష్ అందిస్తున్నారు. నిర్మాత SKNతో కలిసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది. చెన్నై నేపథ్యంగా సాగే ఈ లవ్ స్టోరీలో ఫస్ట్ లవ్, రిలేషన్‌షిప్స్‌లోని కొత్త కోణాన్ని చూపించనున్నట్లు విడుదలైన గ్లింప్స్ సూచిస్తోంది. యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం, సరైన కథల ఎంపికతో ముందుకెళ్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెమ్యునరేషన్ పెంపుపై వస్తున్న వార్తలు నిజమైతే, ఇది ఆయన కెరీర్లో మరో మైలురాయిగా మారే అవకాశం ఉంది.మొత్తానికి, వరుస విజయాల జోరుతో కిరణ్ అబ్బవరం టాలీవుడ్లో తన మార్కెట్ విలువను మరింత స్ట్రాంగ్ చేసుకుంటున్నాడని చెప్పవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

