మాగనూరు నవంబర్ 09: అందరికి సన్న బియ్యం ఉచిత ప్రజా పంపిణీ అనే కార్యక్రమం ఒక బూటకం అని బీజేపీ మాగనూరు కృష్ణ ఉమ్మడి మండల ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి వీడాలన్నారు. కరోనా సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక మనిషికి ఐదు కేజీల బియ్యాన్ని సరఫరా చేస్తుంది. ఒక కేజీ మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయని తెలిపారు. మాగనూరు మండల కేంద్రంలో చేపట్టిన ఉచ్చిత బ్యాగుల పంపిణీలో ప్రధాన మంత్రి ఫొటో లేకపోవడం సరైంది కాదన్నారు.
ఇవి కూడా చదవండి..
Jana Sena Party | జనసేన పార్టీ ‘X’ ఖాతా హ్యాక్, లోగో తొలగింపు.. పార్టీ శ్రేణుల్లో ఆందోళన
Deepika Padukone | భారతీయ నటీనటుల పట్ల హాలీవుడ్లో కూడా వివక్ష: దీపికా పదుకొణె