Jana Sena Party X Account Hacked | ప్రముఖ రాజకీయ పార్టీ జనసేన (JanaSena Party) అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ‘X’ (గతంలో ట్విట్టర్) ఖాతా హ్యాక్‌కు గురైంది. శనివారం రాత్రి నుంచి ఈ ఖాతాలో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హ్యాక్ చేసిన అనంతరం ఖాతా ప్రొఫైల్ లోగోతో (Profile Picture) పాటు కవర్ ఫోటో (Header) తొలగించారు సైబర్ నేరగాళ్లు. అంతేగాకుండా పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని కొన్ని డిజిటల్ లావాదేవీల (Digital Transaction) కంపెనీల ట్వీట్లను ఈ ఖాతా నుంచి రీపోస్ట్ చేశారు.
అయితే తమ పార్టీ ఖాతా హ్యాకింగ్ గురైందన్న విషయాన్ని గమనించిన పార్టీ ఐటీ విభాగం వెంటనే అప్రమత్తమైంది. ఈ ఖాతా నుంచి ఎటువంటి సందేశాలు వచ్చిన స్పందించకండి అంటూ తెలిపింది. గతంలోనూ జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ హ్యాక్‌కు గురైంది. అలాగే, రాష్ట్రంలోని ఇతర ప్రధాన రాజకీయ పార్టీల సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాకింగ్‌కు గురైన సందర్భాలు ఉన్నాయి.
Over $2.6 billion in total deposits across Phase 1 and Phase 2 of the Stable ecosystem-led Pre-Deposit Campaigns, with participation from more than 26,000 wallets.
We appreciate everyone in the community who took part.
Onward. pic.twitter.com/AGVCLEPgDl
— Stable (@stable) November 8, 2025