Jharkhand: బ్యాంక్‌లోకి చొరబడి.. గన్‌పాయింట్‌లో బెదిరించి.. 13 లక్షలు లూటీ
Jharkhand: మాస్క్‌లు ధరించిన ఆరుగురు వ్యక్తులు బ్యాంకులోకి చొరబడి 13 లక్షలు లూటీ చేశారు. జార్ఖండ్‌లోని ఈస్ట్ సింగ్బమ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. భోజన విరామ సమయంలో దుండగులు చొరబడ్డారు. గన్‌పాయింట్‌లో ఉద్యోగుల్ని బెదిరించారు.
జంషెడ్పూర్: జార్ఖండ్(Jharkhand)లో దారుణం జరిగింది. జెంషెడ్పూర్లోని ఓ జాతీయ బ్యాంకులోకి పట్టపగలే దోపిడీ జరిగింది. మాస్క్‌లు ధరించిన ఆరుగురు వ్యక్తులు 13 లక్షలు లూటీ చేశారు. ఈస్ట్ సింగ్బమ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బ్యాంకు భోజన విరామ సమయంలో దుండగులు చొరబడ్డారు. గన్‌పాయింట్‌లో ఉద్యోగుల్ని బెదిరించారు. ఆ తర్వాత లూటీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బ్యాంకు సిబ్బందికి చెందిన బంగారు గొలుసులు, మొబైల్ ఫోన్లు, వ్యాలెట్లు కూడా చోరీ చేశారు.
ఐసీఐసీఐ బ్యాంకులో సుమిత్ కుమార్ గుప్తా అనే ఐటీసీ ఉద్యోగి నగదు డిపాజిట్ చేస్తున్న సమయంలో క్రిమినల్స్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో బ్యాంకులో విచారణ చేపట్టేందుకు సిటీ ఎస్పీతో పాటు ఇతర సీనియర్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. నిందిత వ్యక్తులు చాలా పక్కగా ఈ దోపిడీకి పాల్పడినట్లు ఎస్పీ రాజ్‌కుమార్ మెహతా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

