AR Rahman Hyderabad concert | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ తమ రాబోయే సినిమా ‘పెద్ది’ (Peddi) ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ హైదరాబాద్ కన్సర్ట్‌లో సందడి చేశారు. ఆస్కార్ దిగ్గజం ఏఆర్ రెహమాన్ ‘ది వండర్మెంట్ హైదరాబాద్’ పేరిట హైదరాబాద్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. నవంబర్ 08న ఈ వేడుక జరుగగా.. వేలాదిమంది రెహమాన్ అభిమానులు ఈ కాన్సర్ట్కి హాజరయ్యారు. అయితే ఈ కాన్సర్ట్‌లో పెద్ది సినిమా బృందం సందడి చేసింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ కన్సర్ట్కి రాగా.. రామ్ చరణ్, జాన్వీ కపూర్ వేదికపైకి వచ్చి తమ సినిమా ‘పెద్ది’ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ మరియు అతని బృందం ‘పెద్ది’ సినిమాలోని తొలి సింగిల్ ‘చికిరి’ పాటను లైవ్‌లో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఏఆర్ రెహమాన్‌తో పనిచేయడం తన చిన్ననాటి కల అని తెలిపారు. అంతేకాకుండా ‘పెద్ది’ సినిమా తన ‘ఫేవరెట్ సబ్జెక్ట్’ అని చెప్పి సినిమాపై ఉన్న తన ప్రేమను చాటుకున్నారు. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. తాను ఆరాధించే ఐడల్స్ వ్యక్తులతో కలిసి వేదికను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా రాబోతున్న తాజా చిత్రం పెద్ది. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రాబోతుంది.
Chikiri Chikiri Live Performance By AR Rahman 💥 #Chikiri pic.twitter.com/7Wo1UPpaUr
— Always|Sai🏏🕉️ (@AlwaysRCSai2727) November 8, 2025
Exclusive pics of Team #Peddi from AR Rahman’s concert today. #RamCharan #JanhviKapoor pic.twitter.com/QM9YKa520J
— Telugu Chitraalu (@CineChitraalu) November 8, 2025