మాగనూరు : కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలో ఏబీసీడీ రిజర్వేషన్లు అమలులో నిర్లక్ష్యం చేస్తుందని కర్ణాటక దళిత కుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాయచూర్ బంద్ ( Rayachur Bandh ) నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జాతీయ రహదారులపై టెంట్లు వేసి 12 గంటల పాటు చేసి నిరసన నిర్వహిస్తున్నారు.
దీంతో తెలంగాణ నుంచి రాయచూర్ జిల్లా కర్ణాటక వెళ్లే వాహనాలను ( Vehicle Checking ) రాష్ట్ర సరిహద్దులో టైరోడ్డు సర్కిల్ వద్ద పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారిగేడ్లు పెట్టి వాహనాలను కర్ణాటక వెళ్లకుండా అడ్డుకున్నారు.
కర్ణాటకలోని శక్తి నగర్ ఎస్సై నారాయణ మాట్లాడుతూ బంద్ కారణంగా ముందు జాగ్రత్తగా కర్ణాటక సరిహద్దులో తెలంగాణలోని మక్తల్ సీఐ రామ్ లాల్ కృష్ణ, ఎస్సై నవీద్, మాగనూరు ఎస్సై రేవతి, మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి, రెడ్డితో పాటు వాహనాల తనిఖీలు చేపట్టామని వివరించారు. తనిఖీల వల్ల చెక్‌పోస్టుల వద్ద వాహనాలు నిలిపివేయడంతో దాదాపు 5, 6 కిలోమీటర్ల వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి.