హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం కల్పించి రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత కేసీఆర్‌దేనని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకా ళీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ లు చేశారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని అ మ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించుకుంటున్నట్టు చెప్పారు. బోనాలతో వచ్చిన భక్తులతో కేటీఆర్ ముచ్చటించారు. భక్తులను ఆప్యాయంగా పలుకరిస్తూ ఆలయ పరిసరాల్లో సందడి చేశారు. కేటీఆర్ రాకతో బీఆర్ఎస్ నేతలు, భక్తులు భారీగా అక్కడికి చేరుకున్నారు.
ఆలయ అర్చకులు కేటీఆర్‌కు స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉ మ్మడి రాష్ట్రంలో బోనాల పండుగ నిరాదరణకు గురైందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్ర పండుగగా గుర్తించాలని ఎన్నిసార్లు డిమాండ్ చే సినా, అప్పటి పాలకులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ‘పదేండ్ల పాలనలో దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేశాం. రూ.వే ల కోట్లతో పూర్వవైభవం తీసుకొచ్చాం.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని రూ.1,800 కోట్లతో అభివృద్ధి చేసి తెలంగాణకే తలమానికంగా నిలిపాం. బో నాల సందర్భంగా ప్రతి ఆలయ కమిటీకి నిధులు కేటాయించాం’ అని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో ఆలయాలు, పం డుగలు నిరాదరణకు గురవుతున్నాయని ఆ రోపించారు. కార్యక్రమంలో మాజీ మం త్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పాల్గొన్నారు.