Srinivas Goud | బీఆర్ఎస్ పార్టీని ఎదురుకోవడానికి అన్నీ పార్టీలు ఏకమై ప్రయత్నం చేసాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ భయబ్రాంతులకు గురిచేసిందని.. కొందరు పోలీస్ అధికారులను వినియోగించుకొని బయపెట్టించినా తాము అధిక సీట్లు గెలుచుకున్నామని అన్నారు.
మహబూబ్నగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేము అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్కు 5 శాతం సీట్లు లేవు.. కానీ మేము 30 నుంచి 40 శాతం సీట్లు గెలుచుకున్నాం.. ఓడిపోయినా కూడా 50 ఓట్లలోపు 5 సీట్లు కోల్పోయాం. మద్యం, డబ్బు, అధికారం వినియోగించుకున్నా 16 సీట్లు మేము గెలిచామన్నారు. పట్టణంలో ఉన్న పెండింగ్ పనులు ట్యాంక్ బండ్, వెయ్యి పడకల అస్పత్రి, గురుకులాల భవన నిర్మాణం పనులు, హజ్ హౌస్, క్రిస్టియన్ భవన్ పనులు.. ఇలా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.
వార్డులో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం పిర్యాదులు చేసినా పట్టించుకోలేదు.. డబ్బుల సంచులు నియోజకవర్గాలకు పోతున్నా పోలీస్ అధికారులు పట్టించుకోలేదు. నీళ్లను శుద్ధి చేయకుండా ప్రజలకు ఇస్తున్నారు. మా కౌన్సిలర్లు వెళ్లి శుద్ధి చేసే ప్రాంతాలను పరిశీలిస్తారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. బీసీ రిజర్వేషన్ సమస్య పరిష్కరించి జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు నిర్వహించాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ఉద్యోగులకు 5 డీఏలు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదు.. విశ్రాంత ఉద్యోగస్తులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
Mallela Rajasri | బీఆర్ఎస్లో ఛైర్మన్ పదవి అనుభవించి కాంగ్రెస్లోకి జంప్.. బుద్ధిచెప్పిన ఓటర్లు
Indian Student | అమెరికాలో భారతీయ విద్యార్థి మిస్సింగ్