టెహ్రాన్: ఇరాక్‌లోని పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్(పీఎంఎఫ్)కు చెందిన స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా దాడులు నిర్వహించాయి. అమెరికా దళాలు, సౌదీకి చెందిన ఇంధన సదుపాయాలపై దాడులు నిర్వహించేందుకు ప్రణాళికల కోసం ఈ స్థావరాలను ఉపయోగిస్తున్నట్లు అమెరికా సైన్యం పేర్కొంది. అమెరికా-సౌదీ దాడుల్లో ఏడు ప్రావిన్సులవ్యాప్తంగా తమ సైనికులు 20 మంది మరణించగా మరో 32 మంది గాయపడ్డారని ఇరాక్‌కు చెందిన పీఎంఎఫ్ తెలిపింది. మృతుల సంఖ్యకు సంబంధించిన వివరాలు ప్రాథమికమైనవని, ఆయా ప్రదేశాల్లో తనిఖీలు కొనసాగుతున్న కొద్దీ ఈ సంఖ్య పెరగవచ్చని పీఎంఎఫ్ పేర్కొంది. ఇది జరిగిన కొన్ని గంటలకే జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరం వైపు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.