న్యూఢిల్లీ, జూలై 29: కృత్రిమ మేధస్సు రంగంలో రోజుకో కొత్త ఆవిష్కరణ వెలుగుచూస్తున్నది. ఈసారి హైదరాబాద్కు చెందిన 8 ఏండ్ల బాలుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఇంటర్నెట్ అవసరం లేకుండా పూర్తిగా ఆఫ్లైన్లో పనిచేసే వాయిస్ ఆధారిత ఏఐ కథల పరికరాన్ని తయారుచేశాడు.
‘ప్రాజెక్ట్ బై లక్ష్య్’ అనే హార్డ్వేర్ స్టార్టప్నకు సహ వ్యవస్థాపకుడుగా ఉన్న లక్ష్య్..కేవలం 8 డాలర్ల విలువైన మైక్రో కంట్రోలర్ సహాయంతో ఈ ఆవిష్కరణను సాధించాడు. తక్కువ ఖర్చుతో కూడిన హార్డ్వేర్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ సహాయంతో శక్తివంతమైన ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయవచ్చునని నిరూపించాడు.