గురువారం 06 ఆగస్టు 2020
Komarambheem - Jun 09, 2020 , 06:39:39

పల్లెలను శుభ్రంగా ఉంచుకోవాలి

పల్లెలను శుభ్రంగా ఉంచుకోవాలి

  • ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా 
  • చెడ్వాయి, బొంబాయిగూడలో పనుల పరిశీలన
  • ముగిసిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం

బెజ్జూర్‌(పెంచికల్‌పేట): గ్రామాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. సోమవారం పెంచికల్‌ పేట మండ లం చెడ్వాయి, బొంబాయిగూడ గ్రామాల్లో ముగిసిన పారిశుధ్య కార్యక్రమాలకు హాజరయ్యారు. చెడ్వాయిలో రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను పరిశీలించి కార్యదర్శి శాంతయ్య, ఎంపీడీవో శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఇంకుడు గుంతలను పరిశీలించారు. అనంతరం బొంబాయిగూడలో నర్సరీని పరిశీలించారు. మొక్కలు ఎదుగుదల సరిగా లేదని, హరితహారానికి అందించేలా చర్యలు తీసుకోవాలని కార్యదర్శి వరలక్ష్మి, ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లో వీధి దీపాలు అమర్చాలని, మురుగు కాలువల్లో పూడిక తీయాలని సూచించారు. ఆయన వెంట డీపీవో రమేశ్‌, మండల ప్రత్యేకాధికారి రామ్‌, మిషన్‌ భగీరథ ఏఈ మనోహర్‌, ఎస్‌ఐ రమేశ్‌, సర్పంచ్‌లు, తది తరులు  ఉన్నారు. logo