తెలంగాణలో మండుతున్న ఎండలు
తెలంగాణలో మండుతున్న ఎండలు | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే కొనసాగుతున్నాయి. మంగళవారం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, అర్లి(బి), బేల, చేప్రాల, జైనథ్, నిర్మల్ జిల్లా విశ్వనాథపేటలో 41.7 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37.7 డిగ్రీల నుంచి 41.9 డిగ్రీలుగా రికార్డయింది. గాలిలో తేమ ఆదిలాబాద్‌లో 10 శాతమే నమోదుకాగా.. రాష్ట్రంలో సగటు 42 శాతం నుంచి 88 శాతం వరకు నమోదైంది.
రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరిగాయి. అతి తక్కువగా సంగారెడ్డి జిల్లా అల్లోలెలో 20.6 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రత 39.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.8 డిగ్రీలు రికార్డయింది. కాగా, తెలంగాణ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడింది. సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల వరకు ఇంటీరియర్ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా మరట్వాడా దాకా మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో నిన్న భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని టీఎస్‌డీపీఎస్ తెలిపింది.
ఈ నెల 9, 10 తేదీల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, సిద్దిపేట, కరీంనగర్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోకూడిన వర్షం కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నది. నాగర్‌కర్నూల్ జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఇవికూడా చదవండి..
జైలుపై దాడి.. 1800 మంది ఖైదీలు పరారీ
ఆస్ట్రాజెనికా టీకా.. బ్లడ్ క్లాటింగ్‌కు లింకు నిజమే..
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్‌తో బోలెడు బెనిఫిట్లు!
సీబీఐ విచారణ రద్దు చేయండి.. సుప్రీంకు అనిల్ దేశ్‌ముఖ్
వచ్చే 4 వారాలు కీలకం
నీతి ఆయోగ్‌లో నల్లగొండవాసి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

