ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్‌తో బోలెడు బెనిఫిట్లు!
ప్రీ అప్రూవ్డ్ లోన్‌తో బోల్డ్ బెనిఫిట్లు} సొంతిల్లు కొనుగోలు చేయాలని కోరుకునే వారు ప్రీ అప్రూవ్డ్ లోన్ పొందితే బెనిఫిట్లు..

న్యూఢిల్లీ: సొంత ఇల్లు కలిగి ఉండాలన్నది సగటు భారతీయుడి కల.. దాని సాకారం కోసం మనమంతా అనునిత్యం తపిస్తూనే ఉంటాం.. ఏదో ఒకరోజు అది నిజమవుతుంది.. ప్రత్యేకించి తొలిసారి ఇల్లు కొనుగోలు చేయాలని భావించే వారికి కొన్ని ఆటంకాలు ఇబ్బందులు కలిగిస్తూనే ఉంటాయి. ఆర్థిక పరమైన అంశాలే సొంతిల్లు కొనుగోలు ప్రక్రియలో సవాళ్లుగా నిలుస్తాయి. ఇల్లు కొనుగోలు చేసే అవకాశం చిక్కినప్పుడు.. ఆర్థికంగా అండగా నిలిచే బ్యాంకులు.. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆఫర్ చేసే వడ్డీ రేట్లలో మంచిదేదో నిర్ణయించుకోవడంలో కాస్త గందరగోళం ఏర్పడే పరిస్థితి నెలకొంటుంది..
ప్రీ అప్రూవ్డ్ రుణం కోసం ఇలా అప్లయి చేయాలి
చౌకగా, హాయిగా ఏండ్ల తరబడి వాయిదాలు చెల్లించడానికి వెసులుబాటు గల రుణం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాం.. అదే సమయంలో సదరు బ్యాంకులు ఇచ్చే రుణం అప్రూవల్ కోసం ఎంతకాలం వేచి చూడాలనేది కూడా ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రీ-అప్రూవ్డ్ ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసుకోవడమే కీలకంగా మారుతుంది.
బెస్ట్ ఆప్షన్లపై ఫోకస్ చేయడం మరవొద్దు
ప్రీ-అప్రూవ్డ్ రుణం పొందాక ఇల్లు కొనుగోలు విషయంలో సరైన ఫ్లాట్‌ను ఎంచుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాలు, ఆప్షన్లపైనే ఫోకస్ చేయడం మరిచిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ప్రీ అప్రూవ్డ్ రుణం లభిస్తే, ఇంటి డెవలపర్‌తో చర్చల విషయంలో పై చేయి సాధించినట్లే.
మెరుగైన ఫైనాన్సియల్ ప్లానింగ్ ఇలా
మీరు ఖర్చు చేసే పరిమితి ఎంతో తెలుసుకుంటే ప్రీ అప్రూవ్డ్ రుణానికి ముఖ్యమైన అడ్వాంటేజీగా నిలుస్తుంది. మీ కలలకు అనుగుణంగా ఎటువంటి ఇల్లు కావాలన్న విషయమే మీరు పూర్తి అవగాహనతో ఉంటే అర్హతలేని, అవసరం లేని ఇండ్ల ఊసే మీ మధ్య చర్చకు రాదు.
రుణ ప్రక్రియ ఇలా తేలిక..
ప్రీ అప్రూవ్డ్ రుణ లెటర్ అందుకున్న తర్వాత మీరు సరైన ఆప్షన్ ఖరారు చేసుకుంటే ఆస్తి కొనుగోలు ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి వేచి ఉండాల్సిన అవసరం లేదు. రుణానికి సంబంధించి ప్రీ అప్రూవ్డ్ లేఖ అందుకున్న మరుక్షణం ఇంటిని బుక్ చేసుకోవడం బెటర్. బిల్డర్లు లేదా డెవలపర్ల వద్ద బేరసారాలకు ప్రీ అప్రూవ్డ్ లోన్లు మీకు బోలెడు విశ్వసనీయతను కలిగిస్తాయి.
రుణదాతతో చర్చలకు బెటర్ పొజిషన్ ఇలా
బ్యాంకు యాజమాన్యం ఒకసారి రుణాన్ని అప్రూవ్ చేశాక.. దాని మేనేజర్‌తో చర్చలకు మీకు శక్తినిస్తుంది. రుణం మంజూరు లేఖ అందుకున్న తర్వాత ఇంటిని కొనుగోలు చేయాలన్న విషయమై మీరు సీరియస్‌గా ప్రయత్నిస్తే బేరసారాలు తేలికవుతాయి.
మెరుగైన వడ్డీరేట్లను ఆఫర్ చేసిన తర్వాత కూడా మీరు రుణ దాత (బ్యాంకర్)తో చర్చించొచ్చు. తక్కువ వడ్డీరేటు, రుణం చెల్లింపు కాలాన్ని ఎంచుకుంటే రుణ వాయిదాలు మీకు తేలికవుతాయి.
రుణాన్ని బట్టి ఇల్లు కొనుగోలు ఇలా
ఇల్లు కొనుగోలు చేయాలని మీరు నిర్ణయించుకున్న తర్వాత ఆందోళనకు గురి కావాల్సిన అవసరమే లేదు. బడ్జెట్ మీద అవగాహన ఉంటే రుణ గ్రహిత తనకు సరైన ఇంటిని వెతుక్కోవడంలో మెరుగైన పరిస్థితిలో ఉంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ. కోటి విలువ గల ఇంటి కోసం ప్రీ అప్రూవ్డ్ లోన్ పొందితే రూ. 80-90 లక్షల ఇల్లు కొనుక్కోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి:
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు మమ్ముట్టి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
పోలింగ్ బూత్‌లో పేలిన నాటు బాంబు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
ఉద్ధవ్ ఠాక్రే కూడా రాజీనామా చేయాలి : అథావలే
2021-22 లో 12.5% కు చేరుకోనున్న భారత్ వృద్ధి రేటు : ఐఎంఎఫ్
వడ్డీరేట్ల తగ్గింపులో సర్కారీ బ్యాంకులే బెస్ట్.. సంగతేంటంటే!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

