ఉద్ధవ్ ఠాక్రే కూడా రాజీనామా చేయాలి : రామ్‌దాస్ అథావలే
హోంశాఖ మాజీ మంత్రి అవినీతిపై నైతిక బాధ్యత వహిస్తూ ఠాక్రే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధికారంలో కొనసాగడానికి నైతిక విలువలను కోల్పోయారని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావలే అన్నారు. హోంశాఖ మాజీ మంత్రి అవినీతిపై నైతిక బాధ్యత వహిస్తూ ఠాక్రే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘అనిల్ దేశ్‌ముఖ్ పదవీవిరమణ చేసారు. కాని అతను అంతకుముందే పదవి నుంచి తప్పుకోవాల్సి ఉండె. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కూడా అధికారంలో కొనసాగడానికి నైతికతను కోల్పోయారు. వెంటనే రాజీనామా చేయాలి’ అని అథావలే చెప్పారు.
ప్రజలను రక్షించాల్సిన పోలీసు అధికారి ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇదే మొదటిసారి అని అథవాలే అన్నారు. ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలపై ముంబై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన తరువాత మాత్రమే దేశ్‌ముఖ్ ఎందుకు రాజీనామా చేశారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
కొవిడ్-19 పరిస్థితిని తప్పుగా నిర్వహిస్తున్నారంటూ మహా వికాస్ అగాది ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అథవాలే.. ‘దిగజారుతున్న కొవిడ్-19 పరిస్థితులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మహారాష్ట్రలో నిత్యం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ దేశ్‌ముఖ్ సోమవారం ఉద్ధవ్ ఠాక్రేకు రాజీనామా సమర్పించారు.
అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీసు కమిషనర్ చేసిన అవినీతి ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ ప్రారంభించాలని బొంబాయి హైకోర్టు సోమవారం సీబీఐని ఆదేశించడంతో ఈ పరిణామాలు జరిగాయి.
ఇవి కూడా చదవండి..
ఎయిర్టెల్-జియో మధ్య ఒప్పందం.. మూడు సర్కిళ్లల్లో స్పెక్ట్రం బదలాయింపు
ప్రధానిపై అసత్య రాతలు.. బ్లాగర్‌కు 72 లక్షల జరిమానా
బుర్కా ధరించండని చెప్పి ఇబ్బందుల్లో పడిన ఇమ్రాన్‌ఖాన్
ఆర్మీకి వ్యతిరేకంగా గళమెత్తిన అందగత్తె
2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్
ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం దాకా.. బీజేపీ ప్రస్థానం.. చరిత్రలో ఈరోజు
వ్యాక్సిన్ వద్దు.. ఆర్థికంగా ఆదుకోండి: ఆఫ్ఘన్ శరణార్థులు
అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్‌గా చింతన్ వైష్ణవ్
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్‌వో
వర్చువల్‌గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

