హమారా కెమెరా శారద
కెమెరా శారద | రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఫొటోగ్రాఫర్లకు వర్క్షాపులూ నిర్వహిస్తున్నారు. పట్టుదల, కష్టపడే తత్వం తోడైతే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు తుర్కపల్లికి చెందిన శారద.

‘మగాళ్ల వృత్తి’గా ముద్రపడ్డ ఫొటోగ్రఫీలోకి అడుగుపెట్టిన ఆమె.. పురుషాధిక్య సమాజానికి సవాల్ విసిరారు. గరిటె పట్టిన చేతులతోనే కెమెరా పట్టి, వృత్తిలో భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. మహిళలంటే వంటింటికే పరిమితం కాదనీ, ఏ రంగంలోనైనా మగవారికి తీసిపోరనీ చాటి చెబుతున్నారు. ఓవైపు ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తూనే, రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఫొటోగ్రాఫర్లకు వర్క్షాపులూ నిర్వహిస్తున్నారు. పట్టుదల, కష్టపడే తత్వం తోడైతే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు తుర్కపల్లికి చెందిన శారద.
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన ఏశాల శారద పదో తరగతి తర్వాత వృత్తి విద్యాకోర్సు (టైలరింగ్) చేశారు. కొన్నాళ్లపాటు కుట్టుపని కూడా చేశారు. ఆమె భర్త ఏశాల కృష్ణ 20 ఏండ్లుగా స్థానికంగా ‘మమత’ ఫొటో స్టూడియోను నడుపుతున్నారు. వృత్తిలో భాగంగా కృష్ణ వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు, స్టూడియో మూత పడుతుండేది. ఈ క్రమంలోనే శారదకు ఒక ఆలోచన వచ్చింది. తానుకూడా ఫొటోగ్రఫీని నేర్చుకుంటే, ఆయన లేని సమయంలో స్టూడియోను నడిపించవచ్చని అనుకున్నారు. విషయాన్ని చెప్పగా, భర్త ఓకే అన్నారు. ఆయన దగ్గరే మెలకువలు నేర్చుకొని, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా ఎదిగారు. పాస్‌పోర్ట్ సైజు ఫొటోలనుంచి ఆధునిక డిజిటల్ కెమెరాలతో అద్భుతమైన ఫొటోలు తీసే స్థాయికి ఎదిగారు. భర్తతో కలిసి ఔట్‌డోర్ ఫొటోషూట్లకూ వెళ్తున్నారు. పెండ్లిళ్లు, బర్త్‌డేలు.. ఏవి జరిగినా ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఫొటోల మిక్సింగ్, ఆల్బమ్ డిజైనింగ్‌లోనూ నైపుణ్యాన్ని సంపాదించారు.
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు : శారద ప్రతిభను రాష్ట్ర ఫొటోగ్రఫీ యూనియన్ గుర్తించింది. ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రవీంధ్రభారతిలో ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డుతో సత్కరించింది. 2018లో తెలంగాణ ఫొటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపికయ్యారామె. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ఫొటోగ్రఫీపై అవగాహన కలిగిస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఫొటోగ్రాఫర్లతో వర్క్‌షాప్‌నూ నిర్వహించారు.
కృషి ఉంటే..
పట్టుదలతోపాటు కష్టపడే మనస్తత్వం ఉన్న మహిళలు అద్భుతాలు చేయగలరు. నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. నేను ఫొటోగ్రఫీలో రాణిస్తున్నానంటే, నా భర్త ప్రోత్సాహమే కారణం. ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను గుర్తించాలి. గెలుపు సాధించేవరకూ కష్టపడాలి. మగవారికి ఎందులోనూ తీసిపోమని చాటి చెప్పాలి. నా శక్తిమేర సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నా.
- ఏశాల శారద, ఫొటోగ్రాఫర్
-భాస్కరుని సూర్యం రాజు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

