మహారాష్ర్టలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత
ఆక్సిజన్ సిలిండర్ల | మహారాష్ర్ట ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. పుణె నగరంలో ఆస్పత్రుల్లో సరిపడ బెడ్లు లేకపోవడంతో ఆస్పత్రి వెలుపలే చికిత్స పొందుతున్నారు.

ముంబై : మహారాష్ర్టలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 55 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో మహారాష్ర్ట సర్కార్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. పుణె నగరంలో ఆస్పత్రుల్లో సరిపడ బెడ్లు లేకపోవడంతో ఆస్పత్రి వెలుపలే చికిత్స పొందుతున్నారు.
దీంతో తమ రాష్ర్టానికి పొరుగు రాష్ర్టాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చాలని కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు మహారాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే విజ్ఞప్తి చేశారు. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వీలైనంత త్వరగా ఆక్సిజన్ సిలిండర్లను పంపాలని కోరారు.
గడిచిన 24 గంటల్లో ముంబైలో 10,030 పాజిటివ్ కేసులు, 31 మరణాలు, పుణెలో 11,040 కేసులు, 34 మరణాలు, నాసిక్‌లో 4,350 కేసులు, 24 మరణాలు, నాగ్‌పూర్‌లో 3,753 కేసులు, 35 మరణాలు సంభవించాయి.
ఇవి కూడా చదవండి..
హమారా కెమెరా శారద
తెలంగాణలో మండుతున్న ఎండలు
అపోహాలు వద్దు..వాక్సిన్ వేసుకోండి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

