Mallu Bhatti Vikramarka | మధిర, ఫిబ్రవరి 26 : ప్రజలంతా శ్రీ మృత్యుంజయ స్వామి వారి కృపాకటాక్షాలతో సుభిక్షంగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఇవాళ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మధిరలో శ్రీ మృత్యుంజయ స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు శ్రీ మృత్యుంజయ స్వామివారికి భట్టి విక్రమార్క దంపతులతో ప్రత్యేకంగా పూజలు చేయించారు. అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, సత్యం బాబు తదితరులు పాల్గొన్నారు.
SLBC Tunnel Mishap | చివరి దశకు రెస్క్యూ ఆపరేషన్.. సొరంగంలోకి ఉత్తరాఖండ్ టీం
Maha shivratri | శివరాత్రి స్పెషల్.. టాలీవుడ్ నుంచి కొత్త సినిమా పోస్టర్లు
Maha Kumbh | యాత్రికులతో కిటకిటలాడుతున్న ప్రయాగ్రాజ్.. 65 కోట్ల మంది పుణ్యస్నానాలు
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!