SLBC Tunnel Mishap | మహబూబ్నగర్ : వాళ్లంతా నూనుగు మీసాల యువకులు.. పట్టుమని 25 ఏళ్లు కూడా ఉండవు.. కానీ అసాధ్యం కానీ దాన్ని సుసాధ్యం చేసి చూపించారు.. ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల జాడను మరికొద్ది గంటల్లో ఛేదించనున్నారు. సొరంగం రెస్క్యూ టీంలో వీరి పాత్ర కీలకం…
ఉత్తరాఖండ్ కు చెందిన 14 మంది ర్యాట్ మైనర్ టీంకు నాయకత్వం వహిస్తున్న ఫిరోజ్ ఖురేషి ఇవాళ తెల్లవారుజామున ఎస్ఎల్బీసీ సొరంగంలోకి ప్రవేశించారు. వీపులకు తాళ్లు కట్టుకొని.. చివరి పాయింట్ వరకు తన బృందాన్ని తీసుకువెళ్లారు. సాదాసీదా టీ షర్టులు ప్యాంట్లు ధరించిన ఈ బృందం ఘటనా స్థలాన్ని గుర్తించినట్లు సమాచారం.
14 కిలోమీటర్ల పరిధిలో ల్యాండ్ స్లైడ్తో పూర్తిగా దెబ్బతిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు చేరుకొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ను చివరి ఘట్టానికి తీసుకువెళ్లారు. గత ఐదు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ నేవీ ఆర్మీ కూడా వెళ్లలేని ప్రదేశానికి చొచ్చుకొని వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ల ద్వారా చరిత్ర సృష్టించారు.
చేతుల్లో పలుగు పారలు మాత్రమే పట్టుకుని అత్యంత ధైర్య సాహసాలతో ఘటనాస్థలాన్ని మొత్తం కలియదిరిగి చిత్రీకరించారు. ఉబికి వస్తున్న ఊటను… పేరుకుపోయిన బురదను లెక్కచేయకుండా పక్కకు జరిపి ఔరా అనిపించుకున్నారు. టన్నెల్ లాస్ట్ పాయింట్ వరకు చేరుకొని మరోసారి తిరుగులేదని నిరూపించుకున్నారు. టిబిఎం మిషన్ పూర్తిగా ధ్వంసం అయిందని తేల్చారు. సొరంగం ఎదురుగుండా స్వచ్ఛమైన నీటి ధార వస్తుందని.. సొరంగం లైనింగ్ నుంచి కూడా నీళ్లు పడుతున్నాయని తేల్చారు. బోరింగ్ మిషన్ శకలాలను కూడా పక్కకు తొలగించారు. ర్యాట్ మైనర్స్ చేసిన సాహస దృశ్యాలు నమస్తే తెలంగాణకు ప్రత్యేకంగా చిక్కాయి.
చివరి దశకు రెస్క్యూ ఆపరేషన్..
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కకున్న ఎనిమిది మంది జాడ మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇవాళ (బుధవారం) ఉదయం మరోసారి ఘటన ప్రదేశాన్ని ర్యాట్ మైనర్స్ టీం చేరుకోనుంది. ఇప్పటికే లాస్ట్ పాయింట్ వరకు వెళ్లి అక్కడి పరిస్థితులను పూర్తిగా వివరించారు. మిగతా బృందాలు వెళ్లడానికి దారి ఏర్పరిచారు. టిబిఎన్ మిషన్ చుట్టుపక్కల ఉన్న శకలాలను తొలగించి బురద నీళ్లను ఒక పక్కకు పోయేలా చేశారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ సులభమైంది.
కాగా ల్యాండ్ స్లైడ్ కారణంగా టీబీఎం మిషన్ పూర్తిగా ధ్వంసం అయింది. ఈ మిషన్ కిందనే చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. అక్కడ దుర్గంధం వెదజల్లుతుందని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న నిపుణులు తేల్చారు. దీంతో అంతటా ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్న యి. మరోవైపు పనులు చేపట్టే జయప్రకాష్ కంపెనీకి చెందిన యజమాని కూడా ఇక్కడికి చేరుకోవడం… చిక్కుకున్న వాళ్లంతా తమ పిల్లలాంటి వారిని పేర్కొనడం గమానార్హం.
Maha shivratri | శివరాత్రి స్పెషల్.. టాలీవుడ్ నుంచి కొత్త సినిమా పోస్టర్లు
Maha Kumbh | యాత్రికులతో కిటకిటలాడుతున్న ప్రయాగ్రాజ్.. 65 కోట్ల మంది పుణ్యస్నానాలు
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!