Corn Crop | బోనకల్, ఫిబ్రవరి 25: సాగు నీరు అందక మొక్కజొన్న పంట నీటి ఎద్దడికి గురి అవుతుంది. బోనకల్ మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో సాగర్ కెనాల్ కింద సాగు చేసిన మొక్కజొన్న పైర్లను జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య, మధిర డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు స్వర్ణ విజయచంద్ర, బోనకల్ నీటి పారుదల శాఖ డీఈఈ తమ్మారపు వెంకటేశ్వర్లు నీటి ఎద్దడికి గురి అవుతున్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా నారాయణపురం గ్రామంలోని మొక్కజొన్న రైతులతో ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. నారాయణపురం మైనర్ కాలువ చివరి భూములకు సాగునీరు అందటం లేదని తెలిపారు. ఈ కాలువకు పూర్తిస్థాయిలో మొక్కజొన్న పంటకు త్వరగా నీరు విడుదల చేసినట్లయితే రైతులకు నష్టం కలగదని తెలిపారు. వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తూ ఒకటి లేదా రెండు రోజులు అదనంగా సాగునీరు సరఫరా చేస్తే బాగుంటుందని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. రాబోయే 3 లేదా 4 రోజుల్లో నీటిని విడుదల చేస్తారని, ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారని తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా పంట వడలినట్లు అనిపిస్తే 2% యూరియా ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలనీ సూచించారు. ఎరువుల వినియోగంలో యూరియా అవసరం మేరకు, సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు.
మన భూముల్లో అధికంగా బాస్వర నిల్వలు ఉన్నాయని, పై పాటుగా మాత్రమే కాంప్లెక్స్ ఎరువులు వినియోగించాలని సూచించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో అర్హులైన రైతుల ఫిజికల్ వెరిఫికేషన్ సకాలంలో పూర్తి చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ AEE ఏడుకొండలు, వ్యవసాయ విస్తరణ అధికారులు షేక్ హుస్సేన్ సాహెబ్, నాగినేని నాగసాయి, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Kothagudem | జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.. కొత్త అక్రెడిటేషన్ కార్డులపై మీడియా అకాడమీ విఫలం..
Kothagudem | మళ్లీ సర్వే చేయండి.. కులగణనలో మున్నూరుకాపులకు అన్యాయం: కాంపెల్లి కనకేష్ పటేల్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!