ఇస్లామాబాద్ : భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆరోపించారు. మంగళవారం పాక్ పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భారత్ యుద్ధ సన్నాహాలను వీడి శాంతి చర్చలకు ప్రయత్నించాలని సూచించారు.
మరో యుద్ధానికి తాము సన్నద్ధమవుతున్నట్లు భారత నాయకులు చెబుతున్నారని, జీవితాంత ప్రాంతీయ శాంతి కాముకుడిగా తాను అందుకు సిఫార్సు చేయబోనని జర్దారీ చెప్పారు. యుద్ధ వేదికల నుండి శాంతి చర్చల పైపు వెళ్లాలన్నదే వారికి(భారత్) తానిచ్చే సందేశమని, ప్రాంతీయ భద్రతకు అదే ఏకైక మార్గమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పాక్‌ను ఆయన బాధ్యతాయుతమైన అణుశక్తిగా జర్దారీ అభివర్ణిస్తూ యుద్ధ పర్యవసానాల గురించి భారత్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.