నడిగూడెం, జూలై 23 : రైతులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. గురువారం నడిగూడెంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను ఆయన సందిర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్తు ఏఈ వెంకటగణేష్తో మాట్లాడి రైతులకు 24 గం టల విద్యుత్తు సరఫరాపై ఆరా తీశారు. కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని, సాయంత్రం ఐదు గంటల తర్వాత త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా జరగట్లేదని పలువురు రైతులు మాజీ ఎమ్మెల్యే ఎదుట తమ గోడును వినిపించారు. రైతులకు 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా బొల్లం మాట్లాడుతూ రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వలేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో రైతులు సమృద్ధిగా పం టలు పండించుకున్నారన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. కేవలం కేసీఆర్ మీద కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం లేదని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే యూరియా యాప్‌ను ఎత్తివేస్తామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, మండల సమన్వయ సమితి అధ్యక్షుడు అనంతుల ఆంజనేయులు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి ఉపేందర్, మేకల గంగరాజు, అనంతుల మహేశ్, మాజీ సర్పంచ్ దున్న సుధాకర్, దున్న ప్రవీణ్, మేకల వీరబాబు, దాసరి శ్రీను, జలీల్, మాజీ జడ్పీటీసీ మారుతి ఉపేందర్, కాసాని సతీశ్, కాసాని ఉపేందర్, బడుగుల వెంకటేశ్, వెంకన్న పాల్గొన్నారు.