మాగనూర్, మార్చి 3 : కృష్ణ మండ ల పరిధిలోని కృష్ణానదిలో రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. మండలంలోని ముడుమాల్, వా సునగర్, ఓంకార మఠం,గురుజాల్ గ్రా మాల్లో కృష్ణానదిలో దర్జాగా రోడ్డు వేసుకొని ఐదు ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఒక రీచ్‌కు పది చొప్పున టిప్ప ర్ల ద్వారా ఇసుకను కర్ణాటక రాష్ట్రంలోని సైదాపూర్, గుల్బర్గా, యాదగిర్కు తరలించి ట్రిప్‌కు రూ.20 నుంచి 30 వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రస్తుతం కృష్ణానదిలో నీరు తగ్గడంతో ఇసుక మాఫియ రెచ్చిపోతున్నది. గతం లో ముడుమాల్, వాసునగర్, గురుజా ల్, ఓంకార మఠం సమీపంలో ఇసుక తరలిస్తున్న సమయంలో బీఆర్ఎస్ నా యకులు రెడ్‌హ్యాండేడ్‌గా పట్టుకొని పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చినా ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ఇసుక మాఫియా మరింత రెచ్చిపోయి ఇసుకను తరలిస్తున్నారు. గత నెలలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి గురుజాల్ సమీపంలో సిద్దలింగ మఠం వెనుక భాగంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపును గుర్తించి తాసీల్దార్‌తో సీజ్ చేయించారు.
టాస్క్‌ఫోర్స్ దాడుల్లో పట్టుబడిన 7 టిప్పర్లు, 5 ఇసుక ట్రాక్టర్లు
కృష్ణ మండలంలో ఓంకార మఠం సమీపంలో రాత్రి వేళలో కొనసాగుతున్న ఇసుక రవాణాపై ఎస్సై పురుషోత్తం తన సిబ్బందితో దాడి చేసి అక్కడ ఉన్న ఏడు టిప్పర్లు, ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నారు. అయితే ఏడు టిప్పర్లలో 6 ఇసుక కోసం వెయిట్ చేస్తున్న టిప్పర్లను వదిలేసి 6 వాహనాలను మాత్రమే పోలీసులకు అప్పజెప్పడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కృష్ణ తాసీల్దార్ శ్రీనివాసులును వివరణ కోరగా ఇసుక రీచ్‌ల సమీపంలో జీపీవో, వీఆర్ఏను ఏర్పాటు చేశామని, అయితే అధికార పార్టీ నాయకుల అండతోనే ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నదని, అడ్డుపడిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని తాసీల్దార్ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లు, ఒక టిప్పర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఆరుగురు వ్యక్తులకు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై నవీద్ తెలిపారు.