ITDA PO Rahul | చండ్రుగొండ, ఫిబ్రవరి 18 : విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులు, పాఠశాలకు గుర్తింపు తేవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ విద్యార్థులకు సూచించారు. ఇవాళ చండ్రుగొండ మండలంలోని తిప్పనపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాలను, గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులను తరగతి గదుల వైపు ఆకర్షించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఇటీవల ఆయన స్వయంగా తయారుచేసిన ఉద్దీపకం పుస్తకాన్ని విద్యార్థులు ఇస్తే వ్రాయించాలన్నారు. ఒకటి నుండి ఐదు తరగతులలోపు విద్యార్థులు ఇంగ్లీషు, తెలుగులో రాయడం చదవడంతోపాటు గణితంపై పట్టు సాధించేలా కృషి చేయాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు టీచర్‌గా మారి పలు ప్రశ్నలను వేసి జవాబులను రాబట్టారు. డిక్టేషన్ చెప్పి బోర్డుపై చాక్‌పీస్‌తో విద్యార్థులు స్వయంగా వ్రాసేలా తర్ఫీదును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పాల్వంచ ఏహెచ్ఎస్హెచ్ ఎం బద్రు, ఏటిడీఓ చంద్రమోహన్, ప్రధానోపాధ్యాయులు సునీత, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
State Level Select | రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కోటపల్లి ఆశ్రమ విద్యార్థిని ఎంపిక
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..