కోటపల్లి : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కోటపల్లి గిరిజన బాలకల ఆశ్రమ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని పారిపెల్లి సుప్రియ( Supriya ) రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక (State Level Select ) అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లాస్థాయి పోటీలలో షాట్పుట్ , డిస్కస్ త్రో (Discus throw) , జావెలిన్ త్రో (Javelin throw) విభాగంలో ప్రతిభకనబరచిన సుప్రియ ఈనెల 18, 19 తేదీలలో హైదరాబాద్లోని ఉస్మానియా యూన్సివర్సిటీలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడాపోటీలలో పాల్గొంటుందని వివరించారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక అయిన విద్యార్ధిని పాఠశాల హెచ్ఎంతో పాటు పీఎస్ హెచ్ఎం మధునయ్య , ఉపాధ్యాయులు లావణ్య, పీడీ శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.