Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా టేకులపల్లిలో దారుణం చోటుచేసుకున్నది. భార్యా పిల్లలను చూసేందుకు వచ్చిన అల్లుడిపై అత్తామామ, బామ్మర్దులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. టేకులపల్లి మండలం రామచంద్రునిపేటకు చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు, అనురాధ దంపతుల కుమార్తె కావ్య, పాల్వంచ మండలం దంతలబోరు గ్రామానికి చెందిన బల్లెం గౌతమ్(24) మూడేండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
టేకులపల్లి, ఫిబ్రవరి 17: భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా టేకులపల్లిలో దారుణం చోటుచేసుకున్నది. భార్యా పిల్లలను చూసేందుకు వచ్చిన అల్లుడిపై అత్తామామ, బామ్మర్దులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. టేకులపల్లి మండలం రామచంద్రునిపేటకు చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు, అనురాధ దంపతుల కుమార్తె కావ్య, పాల్వంచ మండలం దంతలబోరు గ్రామానికి చెందిన బల్లెం గౌతమ్(24) మూడేండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎలక్ట్రిషన్ పనిచేస్తూ సుజాతనగర్లో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు. అయితే ఐదు నెలల క్రితం భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో అప్పటి నుంచి కావ్య తన తల్లిగారి ఇంటి వద్దే ఉంటుంది.
కాగా, ఈ నెల 2న రాత్రి భార్యా పిల్లలతో మాట్లాడటానికి అత్తగారి ఇంటికి వచ్చిన గౌతమ్‌ను అత్త మామ, బామ్మర్దులు అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో గౌతమ్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించి ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకున్నారు. పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో మంటలకు తాళలేక అక్కడే ఉన్న నీటితొట్టిలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు ఖమ్మం హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో గౌతమ్ మృతి చెందారు. మృతుడి తండ్రి బల్లెం వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haryana | రోహ్తక్లో గ్యాంగ్‌వార్.. నలుగురి హతం!
Anitha Vangalapudi | ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై ఏపీ హోంమంత్రి ప్రశంసలు.. ఆడపిల్లల కలలపై అద్భుతమైన సందేశమంటూ కామెంట్!
Upendra | రెండేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్న రియల్ స్టార్ ఉపేంద్ర.. కొత్త సినిమాపై కీలక ప్రకటన!
Biker | నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకున్న బైకర్.. వీడియో
Vrushakarma | నాగచైతన్య ‘వృషకర్మ’ ట్రైలర్ వచ్చేసింది.. డిసెంబర్ 4న థియేటర్లలోకి,అంచనాలు పెంచుతున్న చైతూ కొత్త సినిమా!
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

