Yellandu Municipality | ఇల్లెందు, ఫిబ్రవరి 8: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులను చూసి మళ్లీ కేసీఆర్ సీఎం కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు భారీగా బీఆర్ఎస్లోకి చేరుతున్నారు.
ఇల్లెందులో కాంగ్రెస్ పార్టీ నుండి పలు కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నాయకులు ఔజర్ లోద్, రాంగోపాల్, అరుణ ఆధ్వర్యంలో 30 కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే నలుగురు అనుచరులు అనేక దౌర్జన్యాలకు, దందాలకు పాల్పడి ప్రజలను భయభంతులకు గురి చేస్తున్నారని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ బీఆర్ఎస్ పార్టీ, మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇల్లెందును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మా హయాంలో మంజూరైన పనులు చేసిన అభివృద్ధిని ప్రస్తుతం ఎమ్మెల్యే తాను చేసినట్టుగా చెప్పుకుంటున్నారని.. ఇల్లెందు మున్సిపాలిటీని 350 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్‌దేనని అన్నారు.
మా హయాంలో ఇల్లెందు బస్ డిపో, పట్టణంలో రోడ్ల విస్తీర్ణం, సీసీ రోడ్లు, వంద పడకల ఆస్పత్రి, పట్టణ ప్రగతి కింద పల్లె ప్రకృతి వనాలు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నిలిచి ఇల్లెందుకు నీటి సమస్యను శాశ్వతంగా తీర్చమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని.. మేము మంజూరు చేసిన పనులనే వారు శంకుస్థాపన చేస్తూ చేసినట్లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బర్, నాయకులు భూక్య దల్ సింగ్ నాయక్, గిన్నారపు రాజేష్, స్థానిక నాయకులు కౌశల్ లోదు, రాంగోపాల్, అరుణ, సంజయ్ ,కళ్యాణ్ నందు, ఘాజి తదితరులు పాల్గొన్నారు.

Nizampet | నిజాంపేటలో ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు
Madhya Pradesh | పెండ్లి కార్డులు పంచడానికి వెళ్తుండగా బైకును ఢీకొన్న ఆడి కారు.. ముగ్గురు మృతి