నైపుణ్యాలతోనే ఉద్యోగాలు
డిగ్రీలు, ప్రతిభ, ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ నైపుణ్యాలు ఉంటేనే యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
- ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ అవార్డ్స్‌లో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): డిగ్రీలు, ప్రతిభ, ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ నైపుణ్యాలు ఉంటేనే యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం టీ-వర్క్స్‌లో నిర్వహించిన ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ అవార్డ్స్-2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టెక్నాలజీ, పరిశ్రమలు మారినా.. నేర్చుకోవాలన్న తపన కొత్త ఆర్థిక వ్యవస్థలో తప్పనిసరి అని చెప్పారు. కృత్రిమ మేధస్సు (ఏఐ)తో ఉద్యోగాలు మారుతాయని, అదే సమయంలో కొత్త వృత్తులు, పరిశ్రమలు, అవకాశాలు భారీగా వస్తాయని వివరించారు. ఏఐ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీలు భవిష్యత్తు సాంకేతిక విప్లవానికి కీలకంగా మారనున్నట్టు తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో సుమారు 20వేల ఉద్యోగావకాశాలున్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 10 వేల మంది విద్యార్థులకు పరిశ్రమల సహకారంతో శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు. శిక్షణతోపాటు ఉపాధికి అనుసంధానించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ నిర్వాహకులు రమణ, క్రిష్, టీ-వర్క్స్ సీఈవో జోగిందర్ తణికెళ్ల, టాస్క్ సీఈవో నితిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

