హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ పశువైద్యరంగ నిపుణుడు, శాస్త్రవేత్త డాక్టర్ సీ కృష్ణారావు పేరుతో ప్రతి సంవత్సరం పశుసంవర్ధక రంగంలో విశిష్ట సేవలందించిన వారికి ఇస్తున్న అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డాక్టర్ సీ కృష్ణారావు మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ వీ లక్ష్మారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఔత్సాహికులు తమ దరఖాస్తులను ఈ నెల 21లోగా డాక్టర్ సీ కృష్ణారావు మెమోరియల్ సొసైటీ, రూం నంబర్ 1, వెట్ హోం, శాంతినగర్, హైదరాబాద్-5000028లో అందజేయాలని సూచించారు.