ముషీరాబాద్, సెప్టెంబర్ 16 : అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న హమారా ప్రసాద్‌కు మాదిగల చేతిలో దేహశుద్ధి తప్పదని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు. బుధవారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
అంబేద్కర్‌పై ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకొని, బుక్ రిలీజ్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తగిన బుద్ధి చెప్తామని స్పష్టంచేశారు.